
ఉర్రూతలుగించిన "కెవ్వు కేక"
ఈ కెవ్వు కేక పాటలు మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈ పాటలో తన అందచందాలను.. చూపించి... పాట కు రేంజ్ హైట్ తీసుకువచ్చింది మలైకా అరోరా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కెవ్వు కేక పాట గబ్బర్ సింగ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఈ పాటలో పోలీస్ యూనిఫాం లో పవన్ కళ్యాణ్ స్టెప్పులేయడం మరో ఎత్తు. ఈ కెవ్వుకేక పాట రాగానే థియేటర్ల లోనూ ప్రేక్షకులు... విజిల్స్ మరియు చప్పట్లతో ఎంజాయ్ చేసేవారు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కెవ్వు కేక.. పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
దబాంగ్ సినిమాలోని మున్ని బద్నాం హూఈ అనే పాటకు రీమేకే ఈ కెవ్వు కేక పాట. అయితే...మున్ని బద్నాం పాట కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది కెవ్వు కేక సాంగ్. వ్యూస్ పరంగానూ మరియు క్రేజ్ పరంగాను.. కెవ్వు కేక రికార్డులను సృష్టించింది. కుర్రకారును ఊగిసలాడింది. కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో.... 2012 సంవత్సరం లో గబ్బర్ సింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కింది. అయితే ఈ గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు... మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.