గోపిచంద్ కి తల్లిగా ఆ సీనియర్ నటి..!!

Anilkumar
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలకి సమానంగా నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి..ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయ శాంతి.. ఆ సినిమాలో ఓ చక్కటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే మళ్ళీ ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ఒప్పుకోలేదు.ఇక విజయ శాంతి తాజాగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్, శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర..

 మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రానుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సినిమా కథ తో పాటు పాత్ర కూడా నచ్చడంతో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.ఇక త్వరలోనే ఈ సినిమాలో విజయశాంతి పాత్రకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..ఇక గోపిచంద్ తండ్రి టి.కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన కొన్ని సినిమాల్లో నటించింది విజయశాంతి.ఇక ఆ సినిమాలు విజయశాంతికి మంచి పేరును తెచ్చిపెట్టయి.

అయితే దర్శకుడు టి. కృష్ణ మీద ఉన్న గౌరవం వల్లే విజయశాంతి గోపిచంద్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు ఇదే సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపిచంద్..తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' సినిమాలో నటిస్తున్నాడు గోపిచంద్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్ కి జోడిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: