నన్ను లావుగా ఉన్నప్పుడు అసహ్యంగా ఉన్నావు అని అన్నారు..ఎన్టీఆర్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో పలుమార్లు కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.

 ఎన్నో సార్లు విడుదల తేదీ వాయిదా పడిన 'ఆర్ఆర్ఆర్'  సినిమా చివరగా దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇలా 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దీనితో పాటే బుల్లితెరపై 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే 'షో' కు కూడా హోస్టు గా వ్యవహరిస్తున్నాడు. ఈ 'షో' ఈమధ్యె రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రారంభం అయ్యింది. ఈ 'షో' ప్రారంభం అయిన రోజు స్పెషల్ గెస్ట్ గా రామ్ చరణ్ విచ్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తమ స్నేహం గురించి , సినిమాల గురించి మరియు ఇతర విషయాల గురించి చర్చిస్తూ చాలా సరదాగా 'షో' ను కొనసాగించారు. ఇలా మొదటి రోజును పూర్తిచేసుకున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రస్తుతం కంటెస్టెంట్స్ తో నడుస్తుంది. అయితే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో నిర్వాహక బృందం తాజాగా వదిలిన ప్రోమో లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ తన ముందు హాట్ సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి తో మాట్లాడుతూ మీకు జుట్టు ప్రాబ్లం , నాకు కొవ్వు ప్రాబ్లం, చాలా లావుగా ఉండే వాడిని , అసహ్యంగా ఉన్నారు అని అన్నారు. అన్నట్టుగా ఎన్టీఆర్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: