షర్మిల పొత్తులు: కేసీఆర్ కు అధికారాన్ని దూరం చేస్తాయా ?
అందుకే షర్మిల వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్దమైనట్లుగా పొలిటికల్ వర్గాల్లో టాక్. కేసీఆర్ అంటే అస్సలు పడని పార్టీలతో కలిసి ముందుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తోంది షర్మిల. అయితే ఈ పొత్తు పెట్టుకోవడం వలన షర్మిలకు ప్లస్ అవుతుందా అన్న విషయంపై అన్ని కోణాల్లో పొలిటికల్ వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దీని వలన కేసీఆర్ కు ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎప్పుడైతే పార్టీలు ఎక్కువ అవుతాయో అప్పుడు ఓటింగ్ శాతం డివైడ్ అయిపోతుంది. ఇది అధికార పార్టీ తెరాస మళ్లీ గెలవడానికి ప్రతికూలం కావొచ్చు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఈ విషయాన్ని కేసీఆర్ వ్యతిరేక పార్టీలు క్యాష్ చేసుకోవాలని చేస్తున్నాయి. అందుకోసమే ప్రజల్లో మద్దతు ఉన్న వామపక్ష పార్టీలతో కలిసి వెళ్లే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపి, తెలంగాణ జన సమితి, బీఎస్పీ ఇలా చాలా పార్టీలు కేసీఆర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి.
దీనితో వచ్చే ఎన్నికల్లో దాదాపుగా తెరాస కు ఇది ఇబ్బంది కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. షర్మిల పార్టీ కొత్తది అయినా ఇప్పటికీ ప్రజల్లో దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డిపై అభిమానం ప్రేమ ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ సెంటిమెంటును కూడా వాడుకుని తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు షర్మిల తీవ్రంగా శ్రమిస్తోంది. షర్మిల అనుకుంటున్నట్లుగా వామపక్షాలు అన్నీ ఈమెతో పొత్తు పెట్టుకోడానికి అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టడం ఖాయం. మరి షర్మిల అనుకున్న విధంగా జరుగుతుందా ? షర్మిల పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తెరాస తిప్పి కొడుతుందా ? వామపక్ష పార్టీలు షర్మిలతో కలుస్తాయా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.