నాగార్జున కెరీర్ లో సెన్సేషనల్ సినిమాలు ఇవే..
గీతాంజలి :
క్లాసిక్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా 1989 వ సంవత్సరంలో మే 19 వ తేదీన విడుదల అయ్యింది.ఈ సినిమా కథ, పాటలు, మాటలు ప్రేక్షకులను కట్టి పడేసాయి. నాగార్జున కెరీర్లోనే ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రంగా ఈ సినిమా ఎప్పటికి నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శివ :
శివ అంటే సినిమా మాత్రమే కాదు. ఇదో సంచలనం. భారతదేశ సినీమా ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ఇది.1990 లో డిసెంబర్ 7 తేదీన విడుదలయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది.ఇక నాగార్జున పేరు ఎత్తితే శివ సినిమానే గుర్తొస్తుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది.
అన్నమయ్య :
అసలు నాగార్జున ఇలాంటి సినిమాలు కూడా తీయగలడా అని నిరూపించిన సినిమా.అన్నమయ్య అంటే నాగార్జున అని తలపించేలా చేసిన డివోషనల్ సినిమా ఇది.కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1997 వ సంవత్సరంలో మే 22 న విడుదల అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
రక్షకుడు :
రక్షకుడు సినిమా ప్లాప్ అయినా కాని ఇది నాగార్జున ఫ్యాన్స్ మరిచిపోలేని సినిమా 90 లలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యి పాన్ ఇండియా లెవెల్ లో హైప్ క్రియేట్ సినిమా అప్పట్లోనే 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒకేవేళ ఈ సినిమా హిట్ అయ్యుంటే నాగార్జునకి మరో శివ అయ్యుండేది. నాగార్జునని నెంబర్ వన్ హీరోని చేసుండేది. ఈ సినిమాతో ప్రవీణ్ గాంధీ అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు.1997 లో అక్టోబర్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ మెప్పు పొందలేక భారీ ప్లాప్ గా నిలిచింది.
శ్రీరామదాసు :