నాగార్జున కెరీర్ లో అందుకున్న పురస్కారాలివే ?

VAMSI
1989 లో నాగార్జున తన సినిమా జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటికే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఒక హీరోగా వెలుగొందుతున్నాడు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

విక్రమ్, గీతాంజలి, శివ, అన్నమయ్య, రాజన్న, షిర్డీ సాయి, నిన్నే పెళ్ళాడుతా, శ్రీరామదాసు, సంతోషం, సినిమాలలో నాగార్జున నటనకు ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రెండు "సినీ" మా పురస్కారాలు ఉన్నాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో రాష్ట్ర స్థాయిలో అందించే నంది పురస్కారానికి  ఎంత విలువ ఉందో తెలిసిందే. నాగార్జున ఉత్తమ నటుడి విభాగంలో 4 నంది అవార్డులు అందుకున్నారు.

నాగార్జున నటుడి గానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో  నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు. అందులో 5 సినిమాలకు ఉత్తమ నిర్మాతగా అవార్డులు అందుకున్నారు. నిర్మాతగా కొత్త దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఇక నాగార్జున కెరీర్ లో తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోని పాత్రలను పోషించిన సినిమాలుగా అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న చిత్రాలకు గానూ జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నారు.

ఇంత వయసు వచ్చినా ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా ఒక్కో స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో "సోగ్గాడే చిన్ని నాయనా" మూవీకి సీక్వెల్ గా "బంగార్రాజు" మూవీని చేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన అనేక చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ మధ్యనే వచ్చిన నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ రోజు నాగార్జున తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: