ఫ్యాన్స్ కి నాగ్ ఇచ్చే బర్త్ డే సర్ ప్రైజ్ ఇదే..!!

Anilkumar
ఆగస్టు 29 న టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.అయితే తమ అభిమాన హీరో పుట్టినరోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అక్కినేని అభిమానులు. ఆ రోజు నాగ్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రానున్నాయి.ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీనని చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే రేపు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక నాగ్ ఈ సినిమాలో 'విక్రమ్ గాంధీ' అనే ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకి 'ఘోస్ట్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


అయితే నాగ్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి ఆయన నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.ఇక ఈ సినిమా కథ ప్రకారం దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాలో నాగ్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసాడట.ఈ సినిమా నుండి నాగ్ లుక్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది.ఆ లుక్ లో నాగార్జునపూర్తిగా ఓ రఫ్ లుక్ లో,పెరిగిన మీస కట్టుతో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసాడు.ఇక రేపు నాగ్ పుట్టినరోజు రిలీజ్ చేయబోయే లుక్ లో ఎలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జున కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్,శరత్ మరార్, రామ్మోహన్ రావ్ కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


మొత్తానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసారి భారీ హిట్ ని అందుకోవాలని ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు ఈ సీనియర్ హీరో.ఇక ఈ సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న  'బంగార్రాజు' అనే సినిమా కూడా చేస్తున్నాడు నాగ్.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఆయన సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కనిపించనుంది. ఇక నాగ్ బర్త్ డే కి ఈ సినిమా నుండి కూడా ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.మరి బంగార్రాజు ఎలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: