మెగా హీరోని ఢీ కొట్టనున్న అక్కినేని హీరో..?
ఇక సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.యూత్ ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ ఒక ఎన్నారై పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.ఇక ఈ సినిమాపై హీరో అఖిల్ తో పాటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు. అందుకే ఈ సినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అదే అక్టోబర్ 8 వ తేదీన..
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన.. రెండవ సినిమా 'కొండపొలం' సినిమా కూడా విడుదల కానుంది.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొండపొలం అనే నవల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా కూడా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.కానీ కరోనా పరిస్థితుల వల్ల విడుదల కాలేదుఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది రకుల్.పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది.దీంతో అక్టోబర్ 8 న మెగా, అక్కినేని హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే అక్టోబర్ 8 వరకు వేచి చూడాల్సిందే...!!