ఆ నిర్మాతకు పవన్ వార్నింగ్ ఇచ్చాడా...?

murali krishna
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూడటానికి చాలా నిశ్శబ్దంగా ఉంటారని అందరికి తెలుసు. కాని ఎక్కడైనా త‌ప్పు జరిగిందంటే నిప్పులా ఎగిసిప‌డుతుంటారని సమాచారం . సినిమాలు, రాజ‌కీయాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న పవ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రంతో తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ఆ సినిమాతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. క‌రోనా వ‌ల‌న ఈ సినిమాకు అనుకున్నంత క‌లెక్ష‌న్స్ రాలేదని సమాచారం కాని ప్రేక్షకుల‌ని ఎంత‌గానో మెప్పించిందని తెలుస్తుంది. ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయ‌క్ అనే సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే సినిమా చేస్తోన్న విషయం అందరికి తెలిసిందే కదా.

క్రిష్ సినిమాని ముందుగా పూర్తి చేస్తార‌ని అంద‌రు అనుకున్నారట. కాని మ‌లయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్’ కోషియమ్’ సినిమా రీమేక్ షూటింగ్ వేగం పెంచారట.భీమ్లా నాయక్ సినిమాను యంగ్ దర్శకుడు అయిన సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారట . త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోందని సమాచారం.రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోందని వార్త వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ’హరి హర వీరమల్లు’ సినిమా చేయాల్సి ఉందని తెలుస్తుంది.ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగిందని సమాచారం.కానీ పవన్ కళ్యాణ్ ముందుగా మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో ’హరి హర వీరమల్లు’ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నంకు ఖర్చు ఎక్కువగా అవుతుందని తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట.ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సినిమా పూర్తి చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశ్యంతో తన బాధలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్‌గారు మిమ్మల్ని నమ్మి సుమారు రూ. 150 కోట్ల బడ్డెట్ పెట్టాను కాస్త మమ్మల్ని గుర్తించండి అంటూ ఓ మెసేజ్ చేసాడనీ సమాచారం.ఏదైన విష‌యం ఫోన్ లేదా క‌లిసి మాట్లాడి ఉండాల్సింది.ఇలా మెసేజ్ పెట్ట‌డ‌మేంట‌ని ఏ.ఎం. రత్నంకు ఓ రేంజ్‌లో పవన్ క్లాస్ పీకినట్లు సమాచారం..
న‌న్ను న‌మ్మి డ‌బ్బు పెట్ట‌డం కాదు క‌థ‌ని న‌మ్మి పెట్టారు మీరు. నా కోసం అంత బడ్జెట్ పెడుతున్నాన‌ని చెప్పుకోవ‌డం మానుకోమనీ చెప్తూ ప‌వన్ ఫైర్ అయిన‌ట్టు సమాచారం. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విష‌యంలో అస్సలు ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: