రకుల్ ,మంచు లక్ష్మి దాని కోసం ఫ్లైట్ లో వెళ్లారట..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ,తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ఎక్కడ కలిసిన వారి ఆనందానికి అవధులు ఉండవు. చాలా సరదాగా వారు కలిసి ఉన్న సమయాన్ని గడుపుతూ ఉంటారు. వీరిద్దరి స్నేహం గురించి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు మంచి భోజన ప్రేమికులు అన్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. వీరు రక రకాల భోజనాలను తింటూ ఉంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అన్ని రకాల వంటకాలను తినదు. దానికి ప్రధాన కారణం ఒంటి మీద ధ్యాస పెట్టడం. మరి మంచు లక్ష్మి మాత్రం దాదాపుగా తనకు నచ్చిన ఆహారాన్ని ఏమాత్రం వెనకాడకుండా తింటూ ,జిమ్ లో కుస్తీ పడుతూ ఉంటుంది. అయితే ఆ భోజనం మీద ఉన్న ప్రేమతో  మంచు లక్ష్మి ప్రముఖ తెలుగు 'ఓటీటీ' సంస్థ అయిన 'ఆహా' లో 'ఆహా భోజనంబు' అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తోంది.


 ఈ 'షో' కు మొదటి గెస్ట్ గా మంచులక్ష్మి స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్ రావడం మరో విశేషం. అయితే తాజాగా 'ఆహా భోజనంబు' కార్యక్రమానికి 'పుష్పక విమానం'  సినిమా హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ షాన్వీలు వచ్చారు. వీరితో కలిసి మంచు లక్ష్మి అనేక విషయాలను ముచ్చటించింది. అందులో భాగంగా ఆనంద్ దేవరకొండ నాకు భోజనం అంటే చాలా ఇష్టం కానీ వండడం రాదు అని చెప్పాడు. రకరకాల వంటకాలను తినడం అంటే నాకు ఇష్టం అని ఆనంద్ దేవరకొండ తెలిపాడు. దానితో మంచు లక్ష్మీ నాకు రకరకాల వంటకాలను తినడం అంటే ఇష్టం. అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. నాకు ఇండియాలో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. అని సర్చ్ చేయడం అక్కడికి ఫ్లైట్ లో వెళ్లి భోజనం చేయడం అలవాటు అని, రకుల్ తో అలా మధ్యాహ్నం వెళ్లి రాత్రి వరకు తిరిగి వస్తామని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: