అందాల ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా 'మొహబ్బతేన్' సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తొలిప్రేమ' సినిమాతో తెలుగు ప్రజలను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రీతి జింగానియా బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నరసింహ నాయుడు' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. చాలాకాలం పాటు చిత్రసీమలో కొనసాగిన ప్రీతి జింగానియా నిర్మాతగా కూడా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఓటిటి' ప్లాట్ ఫామ్ లలో నటించడానికి ఆసక్తి చూపుతోంది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను 'చుయిముయి అమ్మాయి' లేదా 'మొహబ్బతిన్ అమ్మాయి' అని పిలుస్తుంటారు అని తెలిపింది. ఈ రెండు పేర్లతో పిలుస్తున్న అందుకు కొంత ఆనందంగా ఉన్న మరోవైపు ప్రేక్షకులు కేవలం తనను మాడ్రన్ పాత్రల కంటే చీరలో చూడడానికే ఇష్ట పడుతూ ఉండడం కాస్త ఇబ్బంది కలుగజేస్తుంది అని తెలిపింది. ఇది మాత్రమే కాకుండా తాను ముద్దు సీన్లలో నటించడం కూడా ప్రేక్షకులకు పెద్దగా నచ్చేది కాదు అని తెలియజేసింది.
అయితే తనకు మాత్రం ఓకే జోనర్ లో సినిమాలు చేయడం ఇష్టం ఉండేది కాదు అని, కొత్త రకమైన పాత్రలు చేయాలని చాలా ఆసక్తి ఉండేదని ఎందుకంటే తాను ఓ నిస్సహాయ కోడలిలా ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఇలా ఒకే జోనర్ కి సంబంధించిన సినిమాలలో నటించడం ఎవరికీ ఇష్టం ఉండదు అని కూడా తెలియజేసింది. నటుడు పర్విన్ దాబాస్తో వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ప్రీతి జింగానియా , ప్రస్తుతం ముంబై లో ఉంటున్నారు. ప్రీతి కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అనేక యాడ్స్ లలో కూడా నటించారు.