తాజాగా ఒక ప్రముఖ 'ఓటిటి' లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందుతూ దూసుకుపోతున్న హిందీ సినిమా 'షేర్షా' . సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా , కియారా అద్వానీ హీరోయిన్ గా , విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమా ఇంతలా ప్రజాదరణ పొందుతూ టాప్ ప్లేస్ లో దూసుకుపోవడంతో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 'షేర్షా' సినిమాకు లభించిన అపూర్వ స్పందన నెటిజన్ల ప్రేమకు సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేశాడు.
ఇది మాత్రమే కాకుండా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) రేటింగ్ లో కూడా 8.8 తో టాప్ ప్లేస్ లో నిలిచింది. నెంబర్ వన్ రేటింగ్ హిందీ మూవీ అంటూ సోషల్ మీడియా ద్వారా సిద్ధార్థ్ మల్హోత్రా ప్రకటించుకున్నాడు. చాలా ధైర్యసాహసాలు కలిగి , దేశం కోసం ఎంతో త్యాగం చేసిన అమరవీరుడు అయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర చేయడం మరియు సినిమాను జనాలు ఇంతల ఆచరించడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా పేర్కొన్నాడు.
ఇది చాలా ప్రత్యేకం , ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది .ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ తెలియజేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ కూడా ఈ సినిమా విజయంపై చాలా సంతోషంగా ఉంది. అందుకు సంబంధించి కియారా సోషల్ మీడియాలో ఓ భావోద్వేగమైన పోస్ట్ కూడా పెట్టింది. ఈ సినిమాలో కియారా అద్వానీ డింపుల్ పాత్రలో కనిపించే జనాలను మెప్పించింది. తాజాగా సినిమాలో విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని చూస్తూ కియారా అద్వానీ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అవుతుంది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ మరియు కాష్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు.