'బిగ్ బాస్ - 5' ఫైనల్ లిస్ట్ వచ్చేసింది..?

Anilkumar
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం కొన్ని సరికొత్త షోలు ప్రసారమవుతున్న వాటిల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ మరే షోలో లేదనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఐదవ సీజన్ కి రెడీ అయిపోయింది.ఇక ఈ షో ని మొదట తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం అనేకమందిలో కలిగింది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సీజన్ ని హోస్ట్ చేయడంతో..బిగ్ బాస్1 సక్సెస్ అందుకొని భారీ టీఆర్పీ రేటింగ్స్ ని దక్కించుకుంది.ఇక ఆ తర్వాత సీజన్2 ని నాని, సీజన్ 3,4 లను అక్కినేని నాగార్జున హోస్ట్ చేయగా వాటన్నింటికి ఆడియన్స్ లో మంచి ఆదరణ లభించింది.


ఇక త్వరలోనే ప్రసారం కానున్న సీజన్ 5 పైన ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొంది.ఇక ఇటీవల సీజన్ 5 కి సంబంధించిన ప్రోమోతో షోపై అమాంతం అంచనాలు పెంచేశారు నిర్వాహకులు.ఇక ఇదిలా ఉంటె ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫైనల్ లిస్ట్ లో యాంకర్ రవి,యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్,నటి ప్రియా,సిరి హన్మంత్,సరయు,మానస్ షా,జస్వంత్,లహరి షారి,టీవీ9 యాంకర్ ప్రత్యుష,నటుడు విశ్వ..


సీనియర్ నటి ఉమాదేవి,ఆర్జే కాజల్,లోబో,శ్వేతా వర్మ..
తదితరులు ఉన్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ జాబితాలో ఉన్న వారందరూ రేపు షో లో కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఈ లిస్ట్ ను బట్టి ఈసారి ఎక్కువగా సెలెబ్రెటీలకు అవకాశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.మరి ఇదే ఫైనల్ లిస్టా? లేదా అనేది తెలియాలంటేష షో స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.కాగా బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి స్టార్ మా లో ప్రసారం కానున్నట్లు సమాచారం.ఇక గత సీజన్ ని హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే ఈ సీజన్ ని కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీజన్5 కి సంబంధించిన ప్రోమోల్లో అది స్పష్టం అయ్యింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: