కలల భారతం : దేశ స్వాతంత్రం గురించి తెలియని 10 నిజాలు..
1). మనం ఆగస్ట్ 15న అర్ధరాత్రి నుంచి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం.. ఇదే రోజు భారతదేశంతో పాటు కొరియా, కాంగో, బహ్రేయిన్, లీచిస్టెయిన్ దేశాలు మొత్తం ఇదే రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాయి.
2) ఆగస్టు 15న తేదీని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని.. ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్.. మౌంట్ బట్టెన్ మన పెద్దలకు సూచించాడు.
3). మన జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారని మనందరికీ తెలుసు. కానీ వాస్తవానికి బ్రిటిష్ కింగ్.. జార్జ్ వి గౌరవార్థం ఠాగూర్ రచించారు. 1911లో కింగ్ జార్జ్.. భారత్ కు వచ్చిన సందర్భంగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు. ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు.
4). జాతీయ గేయం..వందేమాతరం ను బంకిం చటర్జీ రచించారు. వాస్తవానికి ఇది ఒక పద్యభాగం. బంకించంద్ర చటర్జీ రాసిన నవలలోని మొదటి, రెండు పేపర్లను తీసుకొని జాతీయగీత గేయంగా ప్రకటించారు.
5). భారత స్వాతంత్ర్యోద్యమం 1857 లోనే ప్రారంభమైంది. దీనికి మంగల్ పాండే నాయకత్వం వహించారు. అంతేకాకుండా అప్పుడే తొలి సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరువాత ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్ మరికొంతమంది పోరాటాలు కొనసాగించారు.
6). భారత్ , పాకిస్తాన్ విడిపోయినప్పుడు జమ్మూ కాశ్మీర్ తటస్థంగా ఉంది. అంతేకాకుండా అప్పుడు ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవారు. పాకిస్థాన్ లోనే జమ్ము కాశ్మీర్ కలుస్తుందని ఆ దేశ ప్రజలు నమ్మారు. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేశారు.
7). జాతీయ గీతానికి వందేమాతరం బదులు.. జనగణమన ను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్ లో వాయించడానికి వందేమాతరం కన్నా జనగణమన సులువుగా ఉంటుందని, జవహర్లాల్ నెహ్రూ భావించారు.
8). భారత్ , పాకిస్తాన్ మధ్య సరిహద్దులను ఫీల్ జాన్ రాడ్క్లిఫ్ ప్రకటించారు. ఈయన బ్రిటిష్ న్యాయవాది.
9). మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇండియాను ఇండస్ అనే నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికత గుర్తుగా ఈ పేరును తీసుకున్నారట.
10) ఇలాంటి ఎన్నో అద్భుతాలను మనం భారతదేశంలో ఉండడం చాలా గర్వకారణంగా ఉంది.