రామారావుతో మళ్ళీ ఇలియానా నటించనుందా?

murali krishna
రవితేజ తన సినిమా కెరీర్ లో తన 68వ చిత్రంగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాకి రవితేజ సహాయక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాదులోనే చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రాక్ సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్న రవితేజ క్రాక్ సినిమాలాగే ఇందులో కూడా కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా రూపొందబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో  రవితేజ సరసన 'దివ్యాంశ కౌశిక్', హీరోయిన్ గా నటించనుంది.అలాగే కర్ణం ఫేమ్ రాజీవ్ విజయన్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం అందింది.
అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ సరసన గోవా బ్యూటీ అయిన ఇలియానా కూడా నటించబోతున్నట్లు టాక్ ఎక్కువగా వినిపిస్తోందట అయితే ఇందులో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు వార్త వినిపిస్తుంది.ఇలియానా ఇలా తెలుగులో స్పెషల్ సాంగ్ లో కనిపించడం ఇదే మొదటిసారని తెలుస్తుంది.అది కూడా కేవలం రవితేజతో ఉన్న మంచి ఫ్రెండ్ షిప్ కారణంగానే ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం అందింది.
గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక చివరగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్-అక్బర్-ఆంటోని సినిమాలో కూడా వీళ్లిద్దరు కలిసి నటించడం జరిగింది. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని సమాచారం. కిక్ సినిమా తో బాగా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినట్లు తెలుస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాని కేవలం 56 రోజుల లోపల సినిమా షూటింగ్ ని పూర్తి చేసే విధంగా దర్శకుడు శరత్ స్క్రిప్టు రెడీ చేసుకున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాలో ఒకప్పటి మంచి హీరో అయిన తొట్టెంపూడి వేణు కూడా మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో అయిన ఇలియానా ,తొట్టెంపూడి వేణు లకు మంచి ఆఫర్ వస్తుందేమో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: