ప్రభాష్ గొప్పతనం గురించి రాజమౌళి మాటల్లో..!!

Anilkumar
ఇండస్ట్రీలో లో స్టార్ హీరో ప్రభాస్ ను అభిమానించే డైరెక్టర్ లు చాలా మంది ఉన్నారు.ప్రభాస్ తో కలిసి పని చేసిన డైరెక్టర్ లు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న డైరెక్టర్ల సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతూ వస్తోంది.ఇక ఇప్పుడు ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో ఇతర ఇండ్రస్టీ డైరెక్టర్స్ కూడా ప్రభాస్ తో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ సంవత్సరం ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే  వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే సారి రానున్నాయి.

అయితే తాజాగా నిర్మాతలు  డబ్బులు ఇస్తామంటే వద్దన్నాడట ప్రభాస్.అయితే ఓ సందర్భంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి  ప్రభాస్ గురించి ఆసక్తి కరమైన విషయాలను చెప్పారు. బాహుబలి రిలీజ్ అవుతున్న సమయంలో నిర్మాతలు ఫోన్ చేసి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారట.అప్పుడు ప్రభాస్ రాజమౌళి కి కాల్ చేసి తీసుకోవాలా వద్దా అని  అడిగారు.అప్పుడు రాజమౌళి ఆ టైం లో ఎక్కువ ఇస్తామంటే తీస్కో అని అన్నారట.అయితే ప్రభాస్ అనుకున్న దానికంటే సినిమా కు ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయింది అని ప్రభాస్ నిర్మాతల గురించి ఆలోచించారని చెప్పుకొచ్చారు రాజమౌళి.దీంతో ప్రభాస్ ఎంత మంచివాడో చెప్పాడు జక్కన్న.

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో సంక్రాంతి కి  రాధేశ్యామ్ సినిమా డేట్ ను ఫిక్స్ చేశారు.ఇక సమ్మర్ ప్రభాస్ లో సలార్ సినిమాతో ఆగష్టు లో ఆదిపురుష్ సినిమాతో..ఇలా ఒకే ఏడాది అది కూడా తక్కువ గ్యాప్ లో ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు ప్రభాస్. అంతేకాకుండా ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఇక వీటితో పాటూ ఇటీవల నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ లో త్వరలోనే జాయిన్ కానున్నాడట ఈ పాన్ ఇండియా హీరో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: