యంగ్ రెబల్ స్టార్ కు సవాల్..!
ప్రభాస్ సినిమాలు చేయడంలో చాలా నెమ్మదిస్తున్నాడనే విమర్శలకి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఒకేసారి మూడు సినిమాలకు కమిట్ అయిపోయాడు. 'సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె' సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. అయితే ఈ సినిమాలు ఒక్కో జానర్లో తెరకెక్కుతున్నాయి. సలార్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే, ఆదిపురుష్ మైథలాజికల్ మూవీ. ఇక 'ప్రాజెక్ట్ కె' సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రాబోతోంది.
'సలార్'లో ప్రభాస్ చాలా రఫ్‌గా కనిపించాలి. ప్రశాంత్ నీల్ సినిమాలకి తగ్గట్లుగా సూపర్ హీరోయిక్‌గా విన్యాసాలు చేయాలి. ఇక 'ఆదిపురుష్'లో ప్రభాస్ పురాణ పురుషుడు రాముడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌కి క్లీన్ షేవ్‌తో కొంచెం సాఫ్ట్‌గా కనిపించాలి. మరి రెండు సినిమా షూటింగ్స్ని ఒకేసారి పూర్తి చేయాలంటే ప్రభాస్ లుక్‌లోనూ వైవిధ్యం చూపించాలి.
'సలార్, ప్రాజెక్ట్-కె' సినిమాల్లో ప్రభాస్ ఎలాంటి లుక్‌లో కనిపించినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశముంది. కథాబలం ఉంటే సినిమా కూడా హిట్ అవుతుంది. అయితే 'ఆదిపురుష్'కి మాత్రం ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రేక్షకులనుంచి విమర్శలు వచ్చే ప్రమాదముంది. మరి ఎదురయ్యే సవాళ్లను ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.