మలైకా ఆస్తులడగగానే ఫైర్ అయిన ప్రియుడు..ఎందుకంటే..?
హీరో అర్జున్ కపూర్ ఈ మధ్యకాలంలో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మలైకాతో ఆస్తిని పోల్చుకుంటూ ఓ పోస్టు చేశాడు. ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసేశాడు. మలైకా ఎంతో సంపాదించిందని, తన ఆస్తిపై ఏవేవో ప్రశ్నలు వేయకండని అర్జున్ కపూర్ విసుక్కున్నాడు. మలైకా ఓ వైపు నటిస్తూనే మరో వైపు నిర్మాతగా చేస్తున్నారు. అంతేకాకుండా టెలివిజన్ హోస్ట్ గా చేస్తూ ఓ షోకు జడ్డిగా ఉన్నారు. గతంలో వీళ్లు పెళ్లి చేసుకున్నట్టుగా ఓ వార్త వచ్చింది. ఆ టైంలో అర్జున్ సీరియస్ అయ్యాడు. మలైకాను పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లుగానే తెలిపాడు. మలైకా ఇదివరకూ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆమె అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనుంది.