ఆర్ఆర్ఆర్ సాధించలేని విజయాన్ని పుష్ప సాధిస్తుందా..?
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయని భావించారు. కానీ ప్రస్తుతం ప్రోమో కంటెంట్‌కు వస్తున్న హైప్ చూస్తుంటే అంచనాల కంటే తక్కువగానే రెస్పాన్స్ లభిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు బడా స్టార్ల యాక్ట్ చేస్తున్నప్పటికీ నాన్-లోకల్ ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకర్షించలేకపోతున్నారు. సుకుమార్, బన్నీ మాత్రం తమ సినిమాతో తెలుగుతో పాటు ఇతర భాషా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియోకి కేవలం 6 రోజుల్లో 25 లక్షల వ్యూస్ వచ్చాయంటే.. సినిమాకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ పాట అద్భుతంగా ఉండి ఐదు భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే.. ఆలిండియా లెవల్లో పుష్ప హైప్ పెంచుకుంటుంది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సింగిల్ దోస్తీకి చాలా తక్కువ రెస్పాన్స్ లభించింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించలేకపోయింది. మరి పుష్ప పాట అంచనాలకు తగ్గట్లుగా ఉండి నాన్ లోకల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధిస్తుందా..? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.