కూతురితో చిందులు వేసిన సురేఖ వాణి.. వీడియో వైరల్..!
సురేఖ భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత ఆమె తన కూతురుతో కలిసి హ్యాపీగానే లైఫ్ గడుపుతోంది. ఆగస్టు 8న సుప్రీత బర్త్ డే కాగా, ఈ సందర్భంగా కూతురితో కలిసి సురేఖావాణి హ్యాపీగా గడిపింది. ఓ సాంగ్‌కు గ్రేస్ ఫుల్ స్టెప్స్ కూడా వేసింది. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట ట్రెండవుతోంది. మోడ్రన్ డ్రెస్సులో తల్లీ కూతుర్లు అక్కా చెల్లెళ్ల మాదిరిగానే హుషారుగా డ్యాన్స్ స్టెప్స్ వేశారు. వైరల్ అవుతున్న వీడియోలో సుప్రీత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. వీడియో చూసి నెటిజన్లు ‘వావ్..సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుప్రీతను నీ టాలీవుడ్ సినిమా ఎంట్రీ ఇప్పుడు? అంటూ అడుగుతున్నారు మరికొందరు నెటిజన్లు. ‘సుప్రీత సూపర్ బ్యూటిఫుల్ గర్ల్’ అంటూ పోస్టులు పెట్టడంతో పాటు వీడియోను తెగ వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెటిజనాలు. ఇకపోతే తల్లీ కూతుర్ల వయసు రోజురోజుకూ తగ్గిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు కొందరు. అయితే, సుప్రీత టాలీవుడ్ ఎంట్రీ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా.