నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ సినిమా అయిన 'కిరిక్ పార్టీ' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ నాగ శౌర్య హీరోగా నటించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'చలో' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా తెలుగు జనం నుండి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో లో గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలలో నటించి మెప్పించింది. కార్తీ హీరోగా నటించిన 'సుల్తాన్' సినిమా తో తమిళ్ ప్రేక్షకులను కూడా రష్మిక పలకరించేది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ తన అమ్మానాన్నలను మాత్రం చాలా కష్ట పెడుతుందట అది ఎందుకో తెలుసా..? ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు.. ఎవరైనా బయటకు వెళ్లి తిరిగి వస్తే ఎక్కడ కరోనా మహమ్మారి బారిన పడతారో అని చాలామంది తల్లిదండ్రులు బయట భయపడుతున్నారు.
అలాగే రష్మిక తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారట.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఒక్క రోజు కూడా తీరిక లేకుండా షూటింగ్ లలో పాల్గొన్నందుకు రష్మిక మందన తల్లిదండ్రులు బాధ పడుతున్నారట. షూటింగ్ లకు అప్పుడప్పుడైనా కొంచెం విరామం ఇవ్వు అని చెప్పినా వినకుండా ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో పాల్గొంటుంది అట.. తాను ఇప్పటికే పెద్ద సినిమాలకు కమిట్ అయ్యాను అని ఇలాంటి సమయంలో సినిమా ప్రాజెక్టులను వదిలిపెట్టడం సరైన పద్ధతి కాదు అని, కరోనా భయాన్ని కూడా పక్కనపెట్టి షూటింగులో పాల్గొంటున్నాను అని చెప్పుకొచ్చింది. వారి మాట వినకుండా షూటింగ్ లకు వెళ్లడం వారిని బాధ పెట్టడమే అని ఆవేదన వ్యక్తం చేసింది.