హిట్ కోసం ఆ విలన్ ను దింపుతున్న సందీప్..
ఇదే తరుణంలో సందీప్ కిషన్ కు ఒక్క హిట్ అయినా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. అందుకోసం తను తీయబోయే సినిమా ఎలాగైనా సక్సెస్ సాధించాలని దృఢ నిశ్చయంతో.. ఒక స్టార్ విలన్ ని దింపాలి అని ఆలోచిస్తున్నారట. అందుకోసం బాగా పాపులర్ సంపాదించిన నటుడు విజయ్ సేతుపతి ని ఎలాగైనా ఒప్పించాలని చూస్తూ ఉన్నారట.
అయితే విజయ్ సేతుపతి దగ్గరికి వెళ్లి సందీప్ కిషన్ అడగగా.. విజయ్ సేతుపతి అతని సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ సినిమా కి దర్శక నిర్మాతలు రాజ్ అండ్ డీకే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈయనతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా భరత్ చౌదరి డైరెక్షన్లో తీయబోతున్నట్లు సమాచారం.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ లో విలన్ గా విజయ్ సేతుపతి మెయిన్ రోల్ లో నటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి కి సందీప్ కిషన్ కి బాగా మంచి స్నేహ బంధం ఉన్నది. అందుచేతనే విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక గతంలో రాజ్ అండ్ డీకే డైరెక్టర్" డీ ఫర్ దోపిడి" అనే చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు మరో సారి సందీప్కిషన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకొచ్చారు. ఏది ఏమైనా విజయ్ సేతుపతి ద్వారా అయినా ఈ యువ హీరో సినిమా హిట్ కావాలని కోరుకుందాం.