నారప్ప తో 'సొట్టబుగ్గల సుందరి' మళ్ళీ... కానీ ?

VAMSI
ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రీతి జింటా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలలో విజయపథంలో దూసుకు వెళుతోంది. తెలుగులోనూ విక్టరీ వెంకటేష్ తో 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో నటించి యువత మనసును కొల్లగొట్టింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో కలసి రాజకుమారుడు సినిమాలో మ్యాజిక్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈమెను తెలుగు తెరపై చూడాలని చాలా ఆశ పడుతున్నారు. అయితే ఇన్నాళ్ళకి తెలుగు అభిమానుల కల నెరవేరేలా కనిపిస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ, ఐపీఎల్ టీం అయిన పంజాబ్ కింగ్స్ కో ఓనర్ గా..ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఈమె తెలుగులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
స్పెషల్ రిక్వెస్ట్ అందడంతో కాదనలేక ప్రీతి సరే అన్నట్లు సమాచారం. వెంకీ తదుపరి చిత్రంలో ఈమె కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఓ స్పెషల్ ఆఫీసర్ పాత్రలో ప్రీతి జింటా కనిపించబోతున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ విషయం నిజమేనని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఓ క్లారిటీ రాదు. అయితే ఈ వార్త విన్న అభిమానులు మాత్రం ఎగిరి గంతేసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ వార్త నిజమై తమ అభిమాన తార వెండి తెరపై సందడి చేసి తమను ఎంటర్టైన్ చెయ్యాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.

గతంలో 1998 ప్రేమంటే ఇదేరా చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది ప్రీతిజింటా.  ఆ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి వీరి కాంబినేషన్ లక్కీ కాంబో అంటూ ప్రశంశలు అందుకుంది. టాలీవుడ్ లో ప్రేమంటే ఇదేరా మూవీ ఒక ఆణిముత్యం  అనే చెప్పాలి. మళ్లీ ఇన్నాళ్లకు సొట్ట బుగ్గల సుందరి తెలుగు తెరపై వెంకీతో కనిపించబోతోంది అనేది వార్త నిజంగా విశేషం. మరి ఈ వార్త నిజం కావాలని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: