ట్రెండ్ సెట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్.. ఫాలో అవుతున్న మిగతా మూవీ టీమ్స్..!

Suma Kallamadi
టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇటీవల ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని.... దాదాపు ఐదు భాషల్లో దోస్తీ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం అయిదు ఇండస్టీ్ లకు చెందిన సింగర్స్ చేత పాట పాడించారు. ఇప్పుడు మిగతా ఇండస్ర్టీల వారు కూడా ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని మూవీల్లో కెల్లా ఆర్ఆర్ఆర్ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. జక్కన్న దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



ఈ మూవీలో హాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో చిన్న పిల్లలతో వచ్చే సీన్లు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని టాక్ నడుస్తోంది. కాగా... ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చరణ్ కు జోడీగా, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఎమ్మా వాట్సన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా మేకింగ్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా అనంతరం విడుదల చేసిన దోస్తీ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని దసరా బరిలో నిలిపేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ వేశారు. మరి వేచి చూడాలి ఆర్ఆర్ఆర్ చెప్పిన డేట్ కే వస్తుందో లేదో....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: