ఫ్లాప్ కొట్టినా రామ్ సినిమా కి భారీ బిజినెస్.. ఆ ఎఫెక్టే!!

P.Nishanth Kumar
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే హిట్ కొడితేనే ఆ హీరో కి మంచి డిమాండ్ నెలకొని ఉంటుంది. తదుపరి సినిమాకు భారీ క్రేజ్ తో పాటు బిజినెస్ కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఫ్లాప్ వచ్చినా కూడా సదరు హీరో తదుపరి సినిమాకు ఏ మాత్రం డిమాండ్ తగ్గదు. పోగా క్రేజ్ కూడా భారీగా నెలకొంటుంది ఆ విధంగా రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు బిజినెస్ భారీగా జరగడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం పోతున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రామ్ పోతినేని ఆ తర్వాత చేసిన రెడ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమాకు ఇది రీమేక్ కాగా తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో మోస్తరు గా ఆడింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాగా కరోనా ఎఫెక్ట్,  సినిమాపై ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోవడంతో యావరేజ్ గా నిలిచింది. దాంతో కొంత టైమ్ తీసుకుని మరీ తమిళ దర్శకుడు లింగుస్వామి తో రామ్ తన తదుపరి సినిమాను ఎంచుకున్నాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అంగరంగవైభవంగా మొదలు కాగా రామ్ పొతినేని ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అని తెలుస్తుంది. ఉప్పెన చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా సరైనోడు లో విలన్ గా అదరగొట్టిన ఆది పినిశెట్టి మరి ఒక పవర్ ఫుల్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. పందెం కోడి సినిమా తరహాలో ఈ సినిమాను కూడా డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తున్నాడట లింగు స్వామి. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్ విషయాలు విడుదల కాకముందే మొదలుకావడం విశేషం. రామ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డు లెవల్లో ఏకంగా మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య సంస్థ వారు 3 కోట్లు పెట్టి సొంతం చేసుకోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: