లాస్ట్ షెడ్యూల్ : ఉక్రెయిన్‌లో అడుగుపెట్టిన ఆర్ఆర్ఆర్ టీమ్..
ఈ మల్టీ స్టార్ చిత్రం కోసం భారీ ఖర్చుతో అక్కడి అందమైన ప్రదేశాలలో విజువల్ వండర్ గా ఈ సాంగ్ ను తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ సాంగ్‌కు సంబంధించి ఆగస్టు మూడో వారం వరకు షూటింగ్ పూర్తవుతుంది. ఈ లాస్ట్ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి చిత్రీకరణ పూర్తవుతుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్ ఆర్ ఆర్ నుంచి ఇటీవల ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్ దోస్తిని విడుదల చేశారు. ఒకేసారి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఐదు ప్రధాన భాషల్లో ఈ స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఎంఎం కీరవాని స్వరపరిచిన ఈ గీతాన్ని హేమచంద్ర తెలుగులో పాడారు. ఇతర భాషల్లో అనిరుధ్ రవిచంద్రన్, అమిత్ త్రివేది, విజయ్ ఏసుదాసు, యాజిన్ నజీర్ ఆలపించారు. ఈ దోస్తీ పాటతో సినిమాలోని మిగతా పాటలు కూడా భారీ స్థాయిలో ఉంటాయేమోనని అభిమానులు ఊహించుకుంటున్నారు.
డీవీవీ పార్వతి సమర్పణలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా నటిస్తుండగా, అన్న మన్యం దొర రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ బామ అలియా భట్ నటిస్తుంది. అజయ్ దేవ్గన్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన మేకింగ్ విడియో, ప్రచార చిత్రాలు సినిమాకు మంచి హైప్‌ను క్రియోట్ చేశాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా ఉత్కంఠ రేపుతోంది.