టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశం రావడం అంటే అది సాధారణ విషయం కాదు.చిరూతో సినిమా చేయడానికి ఎందరో దర్శకనిర్మాతలు లైన్లో ఉంటారు.ఇక ప్రస్తుతం అగ్ర దర్శకులు సైతం మెగాస్టార్ తో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.అయితే ఓ యువ దర్శకుడు మాత్రం తన దగ్గర ఉన్న ఓ కథతో మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసాడు.అది కూడా తన కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్క్ అందుకున్నాడంటే అది మాములు విషయం కాదు.ఆ దర్శకుడు మరెవరో కాదు బాబీ అలియాస్ కే. ఎస్.రవీంద్ర. రవితేజ తో పవర్, ఎన్టీఆర్ తో జై లవకుశ వంటి సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ..
ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ నగర్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తాజాగా వీటన్నింటినిపై క్లారిటీ ఇచ్చాడు బాబీ.అగ్ర నిర్మాణ సంస్థ లో చిరంజీవితో తాను చేయబోయే సినిమా ఒక అభిమానికి,స్టార్ కి మధ్య అనుబంధంతో కూడుకున్నదని..అంతేకాదు ఈ సినిమా కథ రాయడానికి చిరంజీవి గారే స్పూర్తి అని చెబుతున్నాడు బాబీ.అభిమాన హీరోకి ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉండాలి.తెరపై అభిమాన హీరో కనిపిస్తే విజిల్ కొట్టాలనిపించే సీన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట.చిన్నతనం నుండి బాబీ దగ్గర ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయట.
అవే బాబీ ని గత రెండు సంవత్సరాలుగా కథ రాయడానికి దోహద పడ్డాయట.ఇక మెగాస్టార్ కి కథ చెబుతున్నప్పుడు భయం, బెరుకు, ఆనందం ఇలా అన్ని అనుభూతులు కలిగాయట.ఇక అభిమానులకి ఏం కావాలో అన్ని ఈ సినిమాలో ఉంటాయని అంటున్నాడు బాబీ.అంతేకాదు చిరంజీవి గత చిత్రాలు 'ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ సినిమాల రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోందట. అన్నట్లు దసరాకి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో మరో యువ హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.కానీ దానిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది...!!