సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. మరి కొంతమంది మాత్రం చిన్న వయసు నుండే ఫ్రెండ్స్ గా ఉండి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా కొనసాగుతారు. అలా చిన్న వయసు నుండి ఫ్రెండ్స్ గా ఉండి సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న వారిలో మనం ప్రముఖంగా మాట్లాడుకొవాల్సిందే హీరో రామ్ చరణ్, రానా ల గురించి. మొదట వీరిద్దరూ చెన్నైలోని ఒక స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. అలా వీరి స్నేహం బలపడటంతో వీరు కేవలం కలిసి స్కూల్ కు మాత్రమే వెళ్లడం కాకుండా, ఈత కొట్టడం, సినిమాలకు వెళ్లడం ఇలా అనేక పనులు కలిసి వెళ్లేవారు. వీరిద్దరి స్నేహం గురించి బయటి వాళ్లు చెప్పే వాటికంటే వీరే చాలాసార్లు చెప్పారు.
ఒక పబ్లిక్ ఈవెంట్ లో రామ్ చరణ్ చిన్న వయసు నుండి నేను బాగా ఎత్తు పెరగాలని మా అమ్మ క్యారేజ్ లో మంచి ప్రోటీన్ ఫుడ్ పంపించేది. చాలా రోజుల తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఏంటి చరణ్ అని అడిగితే.. నువ్వేమో నాకు క్యారేజ్ పంపిస్తున్నావ్.. రానా కు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి చాలా పెద్ద క్యారేజ్ వస్తుంది. ఆ క్యారెట్ మొత్తం తినేసి నాకు పంపించింది కూడా తినేస్తున్నాడు. అందుకే రానా అంత ఎత్తు పెరిగాడు అని సరదాగా చెప్పాడు. రానా కూడా అనేక సందర్భాలలో నాకు చాలా ఇష్టమైన స్నేహితుడు రామ్ చరణ్ అని చెప్పాడు. వీరిద్దరు ఇప్పటివరకు సినిమాల్లో కలిసి నటించకపోయినా వీరి స్నేహం గురించి సినిమా ఇండస్ట్రీ జనాలు మాత్రమే కాకుండా, మామూలు జనాలు కూడా చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. దానికి ప్రధాన కారణం వీరిద్దరూ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడిన సెలబ్రిటీలలా కాకుండా మామూలు స్నేహితులు లాగా మాట్లాడకపోవడమే. ఇలాగే వీరిద్దరి స్నేహం కొనసాగాలని విరి అభిమానులతోపాటు, ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.