శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా కు షిఫ్ట్ అవుతాడు చెర్రీ. అక్టోబర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకోగా దానికి తగ్గట్లే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులను మొదలుపెట్టాడు జక్కన్న.
ఈ ఒకటవ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రెండ్షిప్ పాటను విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఐదు భాషలకు చెందిన అగ్ర గాయకులు కలిసి ఈ పాటను ఆలపించగా సినిమా నుంచి వస్తున్న తొలి పెద్ద అప్డేట్ కావడంతో ప్రేక్షకులు ఎంతగానో ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తూన్నారు. ఎన్టీఆర్ మరో కథానాయకుడు గా నటిస్తుండగా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇరు హీరోల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ కనిపిస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్ కు సంబంధించిన తదుపరి సినిమా పనులను శంకర్ వేగవంతం చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన కాస్టింగ్ చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు కీయారా అద్వానీ హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడే శంకర్ నిర్ణయానికి మెగా అభిమానులు కొంత నిరాశ పడుతున్నారు. గతంలో కియారా అద్వానీ తో చరణ్ చేసిన వినయ విధేయ రామ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అందరికి తెలిసిందే. మళ్ళీ ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయడం ఎందుకని వేరే హీరోయిన్ నీ తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి వారి రిక్వెస్ట్ ను శంకర్ యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.