ప్రభాస్ ప్రాజెక్ట్ Kలో సమంత.. నెగటివ్ టచ్ తో మరోసారి..!
ఇక ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ రోల్ లో అక్కినేని సమంత నటిస్తున్నట్టు టాక్. ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాల విషయలో ఆచితూచి అడుగులేస్తున్న సమంత పాత్ర ప్రాధాన్యత ఉంటే హీరోయిన్ గా కాకపోయినా సినిమాకు సైన్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో కూడా సమంత నటిస్తుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో ఆమెది నెగటివ్ టచ్ ఉన్న పాత్ర అని అంటున్నారు. సమంతతో పాటుగా మళయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నాడని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ ఏయే పాత్రకు ఎవరెవరు కావాలో వారిని పర్ఫెక్ట్ గా దించుతున్నాడని తెలుస్తుంది.
ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్ కు తగినట్టుగా మూవీ ఉంటుందని తెలుస్తుంది. 2022 లో రెగ్యులర్ షూట్ కు వెళ్లే ఈ సినిమా 2023 చివరన కాని 2024లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కె సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తుంది. తప్పకుండా అందరి అంచనాలను మించి ప్రాజెక్ట్ కె ఉంటుందని తెలుస్తుంది.