డిస్కషన్ పాయింట్ : అంత భయం ఎందుకు వెంకీ?
సినిమాకు కథ కల్పితం కావొచ్చు కానీ సినిమాకు ఆధారం అయ్యే జీవితం కల్పితం కాదు.. విభిన్న వర్గాల సమస్యలూ కల్పితాలు కావు.. అవి వాస్తవాలు.. నేచురల్ గా తీయడం.. నేటివిటీ ఫీల్ తో తీయడం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా వచ్చినవేం కావు.. మా భూమిలోనో చీమలదండులోనో అర్ధరాత్రి స్వతంత్రం లోనో ఎన్నో సామాజిక సమస్యలు చర్చించారు. దళితుల సమస్యలే ప్రధానంగా కథలు వచ్చాయి. అవే సినిమాలకు ప్రేరణ కూడా అయ్యాయి. మా నాయన బాలయ్య చాలు ఇందుకు ఉదాహరణ.
దిద్దుకోలేని
తప్పులే అవి..మన దగ్గర కథలు లేవు అని బాధపడితే నవలలు కథలు అవుతాయి.. ఆ తరహా కథలే సినిమాలకు మూలం అవుతాయి. కానీ ఇక్కడ సినిమాకు రాజ్య హింస నేపథ్యం.. నారప్ప సినిమాలో కులాల ఉనికి ప్రస్తావన లేకుండా చేయడం పెద్ద తప్పు. సినిమా ఏం చెప్పింది అన్నదే ముఖ్యం .. అలా అయితే దళితుల సమస్యలూ ఉనికి అన్నవి రాజ్య హింస నుంచి వచ్చాయి.. కొన్ని కులాల తప్పిదాల కారణంగా వచ్చిన వెనుకబాటు నుంచి వచ్చాయి. అగ్ర వర్ణాలు తాము దిద్దుకోలేని తప్పులు చేయడం వలనే వచ్చాయి..
రీమేక్ ఎందుకు సర్
అనువాదం చెప్పిస్తే సరిపోవునుకానీ ఇదేమీ కాకుండా సినిమాను పూర్తిగా సామాజిక అంతరాలు కాకుండా పేద ధనిక అనే ఆర్థిక అంతరాలతో ఒప్పించడం చాలా తప్పు. అంత భయం ఉంటే ఆ కథ ఒప్పుకోకూడదు. అంత భయం ఉంటే దళితుల కథలకు ఇలాంటి నేపథ్యాలకు అనువాదం సరిపోతుంది.. కానీ రీమేక్ అన్నది సరిపడదు.. తప్పుకోవాల్సింది. వెంకీ ఈ సినిమాకు సరిపోయాడా లేదా అన్నది తరువాత ఒకవేళ ఆయన సరిపోయినా కథకూ ఈ సినిమాకూ అస్సలు సరిపోలేదు. పోలికే లేదు.. మీరు ఆత్మను వదిలి సినిమా తీసి పోయారు అని దళిత సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.. మీ సినిమాకు తమిళ కథకూ ఏం సంబంధం లేదనీ తేల్చేశాయి.