నేనే అంబానీ హీరో ఇంట్లో సంబరాలు.. కారణం..
ఇక ఆర్య సైకిల్ రేస్ లో పాల్గొని , అక్కడకూడా మెడల్ గెల్చుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఆర్యను, తన ఇంటి పక్కనే ఉన్న సినిమాటోగ్రాఫర్ జీవ, ఒక సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి పాల్గొనమని అడిగాడు. అందుకు సరేనని వెళ్లగా, అక్కడ ఆడిషన్స్ లో ఆర్య సెలక్ట్ అవ్వడం జరిగింది. ఉల్లమ్ కెట్కుమాయే అనే సినిమాలో సెలెక్ట్ అయ్యాడు కాకపోతే ఈ సినిమా నిర్మాణం లేట్ అవడంతో, 2005వ సంవత్సరంలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన అరినుథమ్ అరియమలుమ్ అనే సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుతో పాటు మరెన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు , విజయ్ పురస్కారాలకు కూడా నామినేట్ చేయబడ్డాడు. ఇక ఈయన ది షో పీపుల్ అనే నిర్మాణ సంస్థను కూడా నిర్మించి, దాని నుండి ఎన్నో మలయాళం సినిమాలను తక్కువ బడ్జెట్లో నిర్మిస్తున్నాడు. ఇక వివాహ విషయానికొస్తే, 2019 మార్చి 10వ తేదీన అఖిల్ సినిమా హీరోయిన్ తో సాయేసా సైగల్ తో వివాహం జరిగింది. ఇక వీరి వివాహ సమయంలో ఆర్య వయసు 38 సంవత్సరాలు కాగా ఆమె వయసు 21 సంవత్సరాలు కావడం గమనార్హం.
ఇకపోతే ఈ రోజు 2021 జులై 24 వ తేదీ సాయేషా ఒక పాపకు జన్మనిచ్చింది. ఇక వీరి ఇల్లు మొత్తం సంబరాలతో నిండిపోయింది. బంగారు తల్లి మా జీవితంలోకి వచ్చింది అంటూ వీరిద్దరు సంబరాలు జరుపుకుంటున్నారు. అంతేకాదు పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.