ఈ హీరోలతో రొమాన్స్ చేయనున్న హాట్ బ్యూటీస్ వీరేనా..?

Suma Kallamadi
మంచి కథలతో, అగ్ర హీరోలతో శరవేగంగా సినిమాలు ప్లాన్ చేస్తున్న దర్శకులకు హీరోయిన్ విషయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హీరో క్రేజ్ కి తగిన పాపులర్ హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడానికి దర్శకులు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ హీరోల పక్కన సరిగ్గా ఏ హీరోయిన్ సూట్ అవుతారనే విషయం తేల్చుకోలేక తమ సమయం వృధా చేసుకుంటున్నారు. తీరా ఒక నటిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె డేట్స్ దొరకడం లేదు. టాప్ హీరో సినిమా అనగానే హీరోయిన్లు కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నారు. దీంతో దర్శకనిర్మాతలు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ప్రస్తుతం చాలా మంది అగ్ర దర్శకులు హీరోయిన్లను ఫైనలైజ్ చేసే విషయంలో తొందర పడడం లేదు. తమ సినిమాలను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ పూర్తిచేస్తూ.. ఖాళీ సమయాల్లో హీరోయిన్ ని ఫైనాలిజ్ చేసేందుకు సమయం కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, గోపిచంద్ సినిమాల హీరోలు హీరోయిన్ల కోసం వెతుకుతున్నారు. కొరటాల శివతో జూ. ఎన్.టీ.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే లేదా కియారా అద్వానీ ని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే వారం రోజుల్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకి శ్రుతిహాసన్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. రామ్ చరణ్, శంకర్ సినిమాకి ఇంకా ఏ హీరోయిన్ ని ఫైనలైజ్ చేయలేదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఏ హాట్ బ్యూటీ నటిస్తున్నారనే విషయంపై కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కోసం త్రిష, శ్రుతిహాసన్, తమన్నా వంటి అగ్ర హీరోయిన్లలో ఎవరినో ఒకరిని ఫైనలైజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం.
దర్శకుడు శ్రీవాస్ గోపిచంద్ సినిమా కోసం నభా నటేష్ ని ఫిమేల్ లీడ్ రోల్ కి ఎంపిక చేయాలని భావిస్తున్నారట. మరి ఏ హాట్ బ్యూటీ ఏ టాప్ స్టార్స్ తో రొమాన్స్ చేస్తారో కాలమే చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: