'థియేటర్లు ఓపెన్' అవడం ఇక కలేనా ?

VAMSI
కరోనా టార్గెట్ కి థియేటర్స్ మాత్రమే బాగా చిక్కుకున్నాయి అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి. కరోనా వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. అయినా ఇంకా దాని ఆగ్రహం మాత్రం పూర్తిగా చల్లారినట్లు కనిపించడం లేదు. గ్యాప్ ఇచ్చి మరీ దశల వారీగా మానవాళిపై దాడి చేస్తోంది ఈ మాయదారి వైరస్. అయితే మొదట్లో అన్ని పారిశ్రామిక రంగాలు భారీగా దెబ్బ తినగా ఆ తర్వాత అలవాటు పడక తప్పదన్నట్టు ఎలాగోలా రకరకాల ప్లాన్స్ తో అడ్జస్ట్ చేసుకుని కొద్దో గొప్పో ముందుకు సాగుతున్నాయి. ఉదాహరణకు విద్యాసంస్థలైతే కరోనా కారణంగా స్కూల్స్ ఓపెన్ చేయడానికి వీలు కాక పోయినప్పటికీ ఆన్లైన్ క్లాసులు జరుపుతున్నాయి. హోటల్స్ కూడా కొద్దో గొప్పో ఏదోలా కొన్ని అలా నడుస్తున్నాయి. షాపింగ్ మాల్స్, మార్కెట్స్ ఇలా అన్నీ ఎంతో కొంత జరుగుతూనే ఉన్నాయి.
అయితే ప్రజలకు ఎంతోకొంత ఎంటర్ టైన్మెంట్ ను అందించే థియేటర్ల పరిస్థితి మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. కరోనా కాటుకి భారీగా, డిస్కౌంట్ లేకుండా దెబ్బతిన్నది థియేటర్ల యాజమాన్యాలే అనడంలో తప్పు లేదు. ఎందుకంటే కరోనా మొదలైనప్పటి నుండి థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. అడపాదడపా అలా తెరవడం మళ్లీ క్లోజ్ చేసేయడం ఇదే తంతు. ఇక ఈ మధ్య పూర్తి సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను ఓపెన్ చేస్తాం అన్నారు. కానీ ఇంకా ఆవిషయం ఓ కొలిక్కి రాలేదు. ఒకవేళ ఓపెన్ అయినా థర్డ్ వేవ్ భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా అన్న భయం మరింత ఆలోచించేలా చేస్తోంది. కరోనా కాస్త తగ్గు ముఖం పడితే చాలు వెంటనే షూటింగ్ కానిచ్చేస్తున్నారు మన స్టార్లు.
ఇక ఆ తర్వాత థియేటర్లు లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా విడుదల చేయడానికి ఓటీటీలు ఎలాగో ఉండనే ఉన్నాయి. ఇక ఎటొచ్చీ ముప్పల్లా థియేటర్లకు మాత్రమే అన్నట్టుగా గోచరిస్తోంది. ఇక ఈసారైనా థర్డ్ వేవ్ తీవ్రతరం కాకుండా థియేటర్లను తెరుస్తారేమో చూడాలి. దీనితో నిర్మాతలకు మరియు ఎక్సిబిటర్లకు టెన్షన్ పట్టుకుంది. కోట్లు పెట్టి సినిమాలను కొనే వారి పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదు. మరి ఈ థియేటర్ల సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి. కానీ ప్రభుత్వాలు థియేటర్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా ఎందుకో థియేటర్ యాజమాన్యాలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే థియేటర్ లో సినిమా చూడడం కలగానే మిగిలేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: