తన బయోపిక్ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ?

VAMSI
బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా ఈ మధ్య పెళ్లయ్యాక ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ అభిమానుల్ని అలరిస్తున్నారు. అయితే తాజాగా తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది ఈ బాలీవుడ్ బార్బీ. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో బయో పిక్ ల హవా నడుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఈమె జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయం పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. 

కాగా అదే విషయం ఓ ఇంటర్వ్యూ లో ఈమెను అడుగగా, లేదు లేదు నా బయోపిక్ గురించి ఇపుడు ప్రస్తావన వద్దు.
ప్రస్తుతానికి అసలు నాకు ఆ ఉద్దేశ్యమే లేదు. ఇంకా నా జీవితంలో సాధించాల్సింది చాలానే మిగిలి ఉంది. నేను అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా ఉంది. ఇంకా నేను ఆ దశకు చేరుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. తమిళ చలన చిత్రం ‘తమిజాన్‌’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఆ తర్వాత "ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై" అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఇక అక్కడి నుండి ఆమె వెను తిరిగి చూసిందే లేదు.

బాలీవుడ్ నుండి హాలీవుడ్ ఇండస్ట్రీ లోకి సైతం అడుగుపెట్టి అంతర్జాతీయ నటిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఒక మోడల్ గా కెరియర్ ని మొదలు పెట్టిన ఈమె సినీ రంగ జీవితంలో ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకుని ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచింది. ప్రస్తుతం ఈమె ‘మాట్రిక్స్‌’, ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’ తో పాటు పలు హాలీవుడ్‌ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: