సినిమాలను వదిలేస్తా అని వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగులో 'ఫిదా' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అందం, అభినయం, డాన్స్ ఇలా అన్నింటిలోనూ అదరగొడుతూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది.ఫిదా సినిమాలో భానుమతి పాత్రలో ఒదిగిపోయిన సాయి పల్లవి..

ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పింది.దీంతో సాయి పల్లవి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది.గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కేవలం కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఎంచుకుంటూ సౌత్ లోనే నంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది.కేవలం నటన మాత్రమే కాదు తన డాన్స్ తో కుర్రకారుకు మతులు పోగొట్టింది. మారి2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.ఇక ఇదిలా ఉంటె ఇటీవల ఈ అమ్మడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఏడ్చారా అనే ప్రశ్నకు సమాధానంగా..

"ఎన్జీకే సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా దర్శకుడు చేసిన సీన్ ని పదే పదే రీషూట్ చేస్తుండేవాడని..దాంతో ఒక రోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకి చెప్పి ఇంట్లో ఏడ్చేశానని చెప్పింది.ఆ తర్వాత అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని బుజ్జిగించిందని.. ఆ తర్వాత తాను ఎప్పుడూ ఏడ్వాలేదని" చెప్పుకొచ్చింది సాయి పల్లవి.ఇక త్వరలోనే ఈమె చెల్లి కూడా వెండితెరపై హీరోయిన్ గా అడుగు పెట్టబోతోన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో దగ్గుబాటి రానా సరసన 'విరాట పర్వం' అనే సినిమాతో పాటూ న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో హీరోగా నటిస్తోంది. ఇక వీటితో పాటూ తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: