సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న '6 టీన్స్' హీరో ?
ఈ మధ్య ఒకసారి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ వెండి తెరపై తిరిగి సత్తా చాటేందుకు దూసుకొస్తున్నాడు రోహిత్. అయితే సాధారణంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చాలా మంది స్టార్ హీరోలు సైతం సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేటప్పటికీ రూటు మార్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగానూ, విలన్ల గానూ రీఎంట్రీ ఇచ్చి వైవిధ్యంగా కొనసాగిస్తుంటే ఈ హీరో మాత్రం మళ్ళీ హీరో గానే చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. కళాకార్ సినిమాతో తిరిగి హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ చూస్తుంటే ఇందులో రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంతకాలం తర్వాత మళ్లీ హీరోగానే రాబోతున్న రోహిత్ ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ఇన్నాళ్ళ తర్వాత రీ ఎంట్రీ అంటే హీరోగా కాకుండా క్యారక్టర్ ఆర్టిస్ట్ గానో, లేదా విలన్ గానో కాస్త బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట కొందరు నెటిజన్లు. మరి ఈ మేరకు ప్రేక్షకులు రోహిత్ ని ఆదరిస్తారో చూడాలి...