సల్మాన్ సినిమాకు సీక్వల్.. స్టోరీ రెడీ చేసిన రాజమౌళి తండ్రి?
ఇక విజయేంద్ర ప్రసాద్ అందించిన ఎన్నో స్టోరీలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించి ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొట్టాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు కూడా ఎన్నో కథలను అందించారు విజయేంద్రప్రసాద్. బాహుబలి సినిమా స్టోరీని అందించింది కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడం గమనార్హం. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు వివిధ భాషల్లో కూడా కూడా స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించారు విజయేంద్ర ప్రసాద్. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా వచ్చి ఆరేళ్లు పూర్తవుతుంది. అయితే ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ చేయబోతున్నారా అంటే అవును అనే టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఇక బజరంగీ భాయిజాన్ అనే సినిమాకు అద్భుతమైన స్టోరీ అందించిన టాలీవుడ్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇక ఇప్పుడు భజరంగి భాయిజాన్ కి సీక్వెల్ కోసం స్టోరీ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా స్టోరీని అటు సల్మాన్ ఖాన్ వినిపించగా.. సల్మాన్ ఖాన్ కూడా ఈ స్టోరీ విని ఎక్సైజ్ అయినట్లు ఇటీవలే విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో ఇక ఈ సినిమా స్టోరీ ఫైనలైజ్ అవుతుంది అంటూ విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.