రష్మిక ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్..!

shami
కన్నడ భామ రష్మిక ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్ వచ్చి చేరింది. కన్నడ్లో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రష్మిక మందన్న తెలుగులో మొదటి సినిమాగా నాగ శౌర్య ఛలోతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవడంతో అమ్మడికి క్రేజ్ పెరిగింది. ఇక విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం రష్మికకు తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చింది. ఆ సినిమాలో అమ్మడి నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
యువ హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరోలతో కూడా ఛాన్సులు రాబట్టిన రష్మిక నేషనల్ క్రష్ గా కూడా రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది రష్మిక మందన్న. ఇన్ స్టాగ్రాం లో అమ్మడు 19 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది. సౌత్ హీరోయిన్స్ లో ఇన్ స్టాగ్రాం లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న వారిలో రష్మిక కూడా స్థానం సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలో ఆడియెన్స్ మనసులు గెలిచిన రష్మిక ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ తో మరోసారి తన సత్తా చాటుతుంది.
ఇక ప్రస్తుతం అమ్మడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక డీ గ్లామరస్ లుక్ తో కనిపిస్తుందని తెలుస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా తన మార్క్ నటనతో ఆకట్టుకునే రష్మిక రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త రికార్డులు సృష్టించాలని కోరుకుందాం. పుష్పతో పాటుగా శర్వానంద్ నటిస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లులో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది రష్మిక మందన్న. ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఇవే కాదు ఎన్.టి.ఆర్, మహేష్ సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలతో రష్మిక మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకుంటుందని చెప్పొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: