నా చేతుల్లో ఏమీ లేదు.. క్షమించండి.. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు..!
ఇంటెన్స్ యాక్షన్ మూవీ అయిన నారప్ప ని ఎటువంటి హడావుడి లేకుండా ఎందుకు ఆకస్మాత్తుగా రిలీజ్ చేశారు? అని ప్రశ్నించగా.. "నా పని నటించడమే. మిగతా విషయాలను నేను పట్టించుకోను. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎన్ని సెంటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది? వంటి ప్రశ్నలను నేను వేసుకోను. సమయానికి అన్ని జరిగిపోతూనే ఉంటాయి. సినిమాకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది" అని ఆయన సమాధానమిచ్చారు.
మీరు నటించిన సినిమా మొదటిసారిగా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ఈ విషయం చాలా అభిమానులను బాధపెట్టింది. వారందరికీ మీరు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు.. "ప్రతి హీరో ఏదో ఒక సమయంలో తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది. ఓటీటీలో సినిమా రిలీజ్ కావడం వల్ల కొందరు నిరాశ చెందొచ్చు. మరికొందరు హ్యాపీగా ఫీల్ అవచ్చు. నా సినిమా ఓటీటీలో విడుదల కావటం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారందరికీ క్షమాపణలు. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ఉంటాయి. అప్పటి వరకు ఆగాలని నేను కోరుతున్నా. ఓటీటీలో సినిమా చూసినంత మాత్రాన ఎవరూ కూడా నిరాశపడరు. ఎందుకంటే సినిమా హాల్లో చూసినంత కిక్ ఓటీటీలో కూడా దొరుకుతుంది. నా అభిమానులు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటారు" అని వెంకటేష్ సమాధానమిచ్చారు.
వెంకటేష్ ఇంకా మాట్లాడుతూ.. "వెట్రిమారన్, ధనుష్ కలిసి చేసిన క్లాసిక్ మూవీ అసురన్. ఎన్నో హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న అసురన్ చిత్రం చూడగానే బాగా నచ్చింది. ఇలాంటి సినిమా ఇప్పటివరకు నేను ఎందుకు చేయలేదు అనిపించింది. ఆ తర్వాత రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాగా నచ్చుతుందని అనిపించింది. ఈ రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. నారప్ప లుక్, ఎమోషనల్ సీక్వెన్స్ లలో నటిస్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. నా కెరీర్లో నారప్ప సినిమా చేయడమే పెద్ద ఛాలెంజ్. నారప్ప గెటప్‌ని ఓన్ యాభై రోజుల పాటు అదే డ్రెస్, అదే గెటప్ లో ఉన్నా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు సహజంగానే ఎంతో ఎనర్జీ వచ్చేది. ఆ పాత్రలో ఉన్న మ్యాజిక్ కారణంగానే అలా అనిపించేది. ప్రతి రోజూ నేను చేసిన యాక్షన్ సన్నివేశాలని తెరపై చూసుకొని షాక్ అయ్యేవాణ్ణి....."
"అసురన్ చిత్రం శ్రీకాంత్ అడ్డాలకు కూడా బాగా నచ్చింది. అందుకే మేము ఇద్దరం కలిసి రీమేక్ చేయాలని నిర్ణయించాం. నిజానికి అసురన్ సినిమా చేయడం మొత్తం సినిమా బృందానికి ఒక పెద్ద చాలెంజ్. ధనుష్ భారతదేశ అత్యుత్తమ నటులలో ఒకరు. నేను చేసిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాని ఆయన రీమేక్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన అసురన్ సినిమాని నేను రీమేక్ చేస్తున్నాను. నటులు వేరైనా పాత్ర ఒక్కటే. సినిమా సన్నివేశాల్లో నటుడు ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనేది చూడాలి. ఇక్కడ కంపేరిజన్ అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అసలు సినిమాలు చేయకూడదు అనుకుంటా కానీ అలాంటి సమయంలోనే అన్ని వచ్చి ఒకేసారి మీదపడిపోతుంటాయి. నా చేతుల్లో ఏమీ లేదు. నా దగ్గరికి వచ్చిన మంచి సినిమాలు చేయడం. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రారంభించడమే" అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.