కాలేజ్ డేస్ లో విజయ్ సేతుపతి ఏ పని చేసేవాడో తెలుసా..?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి..ప్రస్తుతం సౌత్ ఇండ్రస్టీ మొత్తం లోనే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ తమిళ హీరో.ప్రస్తుతం ఈ హీరో డేట్స్ దొరకడమే చాలా కష్టం అయిపోయింది.ఈయన డేట్స్ కోసం అన్ని భాషల నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయంటే సౌత్ లో విజయ్ సేతుపతి క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.అందుకు తగినట్లుగానే విజయ్ కూడా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక ఇటీవల తెలుగులో ఉప్పెన సినిమాతో నేరుగా విలన్ పాత్రలో నటించారు విజయ్ సేతుపతి.

ఈ సినిమా సంచలన విజయం సాధించింది.ఇక సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన రాయణం అనే పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఇదిలా ఉంటె విజయ్ సేతుపతి మాస్టర్ చెఫ్ అనే ఓ తమిళ టీవీ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవలే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.ఇక ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ..."నాకు వంటలు అంటే చాలా ఇష్టం.జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను.నేను చదువుకునేటప్పుడు నా కాలేజీ రోజులో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా పనిచేశాను.కాలేజ్ అయిపోయాక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12:30 వరకు అక్కడే పనిచేసి.. 

అక్కడే భోజనం చేసేవాడిని.
ఇక నాకు ఇస్టమైన వంటకం ఉల్లి సమోసా.ప్రస్తుతం ఉల్లి సమోసా బయట ఎక్కడా దొరకడం లేదు.కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఉల్లి సమోసా తిని.. ఓ టీ తాగుతా" అని తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను పంచుకున్నాడు.ఇక మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ పై ఇప్పటికే తమిళ ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణం.ఈ ప్రోగ్రామ్ కి విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించడమే.ఇక ప్రస్తుతం తమిళంలో పాటూ పలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.ఇక త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కి కూడా సిద్ధం అవుతున్నాడు ఈ తమిళ స్టార్ హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: