త్రివిక్రమ్ కోసం మెగా హీరో ట్రయల్స్..?

Anilkumar
టాలీవుడ్ ఇండ్రస్టీ లో అగ్ర దర్శకుడిగా త్రివిక్రమ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఇండ్రస్టీ కి రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి, ఇప్పుడు అగ్ర దర్శకులలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ఇక ఇటీవలే అల్లు అర్జున్ తో అల వైకుంఠ పురంలో సినిమాని తెరకెక్కించి ఏకంగా ఇండ్రస్టీ హిట్ అందుకున్నాడు ఈ మాటల మాంత్రికుడు. అయితే ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇంకా కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందని అనుకునే సమయంలో.. ఉన్నట్టుండి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ ప్లేస్ లోకి కొరటాల శివ చేరాడు. ఎన్టీఆర్ కెరీర్లో 30 వ సినిమాను త్రివిక్రమ్ కాకుండా. ఇప్పుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.అయితే త్రివిక్రమ్ మాత్రం కొంత గ్యాప్ తీసుకొని.. ఇప్పుడు మహేష్ తో సినిమాకి కమిటయ్యాడు.ప్రస్తుతం మహేష్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడు త్రివిక్రమ్.. ఇదిలా ఉంటె తాజాగా త్రివిక్రమ్ కోసం ఓ మెగా హీరో ఎదురుచూస్తున్నాడట. మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట'సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమా పూర్తవ్వడనికి మరో 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. 
ఆ తర్వాతే త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు మహేష్. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఓ మెగా హీరో సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్ గట్టిగా ఫోకస్ చేస్తే కచ్చితంగా ఈ గ్యాప్ లో సినిమా కంప్లీట్ చేసేస్తాడు.కాబట్టి ఆ మెగా హీరో త్రివిక్రమ్ ని ఎలాగైనా కన్విన్స్ చేసి.. తొందర్లోనే ఆయనతో సినిమాను పట్టాలెక్కించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడట.మరి ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు? వాటికి సంబంధించి మిగతా వివరాలేవి ప్రస్తుతం తెలియకపోయినా..ఇండ్రస్టీ లో ఈ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: