సినీ ఇండస్ట్రీలో కరోనా చిచ్చు మాములుగా లేదుగా.. !
ఎందు కంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ వలన థియేటర్లు అన్నీ మూత పడ్డాయి. ఈ క్రమంలో నిర్మాతలు వాళ్ళ సినిమాలను ఓటిటీలలో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలకు వ్యతిరేకంగా థియేటర్ యాజ మాన్యాలు గొడవకు దిగారని తెలుస్తుంది. నిర్మాత లంతా ఓటీటీ వైపే ఉన్నారు.. దీంతో ఎగ్జిబిటర్ల తీవ్ర అసహనంతో తరపున తెలంగాణ ఫిలింఛాంబర్ పై గొడవకి దిగడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. కొంతమంది నిర్మాతలు తగ్గినా గాన ఇంకొందరు మాత్రం ఓటీటీ డీల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.
దీంతో ఎగ్జిబిటర్ల అందరూ దండ యాత్ర చేయడానికి రెడీ అయ్యారని తెలిసింది.ఎట్టి పరిస్థితుల్లో నిర్మాతలు అందరు అగ్ర హీరోల చిత్రాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టు బడుతున్నారుట.అలా మమ్మల్ని కాదని సినిమాలను
ఓటీటీలో రిలీజ్ చేస్తే ఊరుకునేది లేదు టైమ్ చూసుకుని మేము కూడా దెబ్బ కొడతామని హెచ్చరిస్తున్నారు.అలాగే థియేటర్లన్నీ మూసేసి నిరసన తెలుతామని మండి పడుతున్నారుట. మరి నిర్మాతలు నిర్ణయం ఎలా ఉంది అనేది చూడాలి.కరోనా వైరస్ ప్రభావం సినిమా రంగంపై ప్రభావం చూపిందని చెప్పాలి. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది