ప్రముఖ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం..!
హీరో సుమన్ వృత్తి జీవితాన్ని కరాటే మాస్టారుగా ప్రారంభించిన ఆయన.. 1977లో నీచల్ కుల్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. మొదటి చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుమన్ కు ప్రత్యేక మైన గుర్తింపు ఉంది. ఆయన పూర్తి పేరు సుమన్ తర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ పుడ్ లలోనే కాదు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ 150కి పైగా చిత్రాల్లో నటించాడు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరుడు.. శ్రీరామదాసులోని రాముడు పాత్రలు సుమన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక రజినీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ చిత్రంలో విలన్ గానూ మెప్పించారు సుమన్. సుమన్ తుళు, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడే ప్రతిభ ఉంది. అంతేకాదు సంస్కృతాన్ని కూడా నేర్చుకున్నారు. ఇక వీణ, గిటార్ లను వినసొంపుగా వాయించే నైపుణ్యం ఉంది.
తెలుగులోపెద్ద యాక్షన్ హీరోగా పేరొందిన సుమన్.. కరాటేలో నైపుణ్యం సాధించారు. షోటోకాన్ అనే కరాటే సంస్థ నుంచి కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తిగా సుమన్ పేరొందాడు. అంతేకాదు కరాటే సమాఖ్యకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు సినీ, నాటక రచయిత నరసరాజు మనుమరాలు శిరీషన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు అఖిలజ ప్రత్యూష.