లింగుసామి సినిమాకు రామ్ రెమ్యునరేషన్ ఎంతంటే..!

shami
ఇస్మార్ట్ శంకర్, రెడ్ రెండు సూపర్ హిట్ సినిమల తర్వాత రామ్ చేస్తున్న మరో క్రేజీ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుంది. తమిళ స్టార్ డైరక్టర్ లింగుసామి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక సినిమాలో రామ్ కు జోడీగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుంది. రామ్ కృతి శెట్టి జోడీ సినిమాకు హైలెట్ ఫ్యాక్టర్ అని చెప్పుకుంటున్నారు. మొదటి సినిమాకే కృతి శెట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా కోసం లింగుసామి 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. హీరో రాం 12 కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా బిజినెస్ లో ప్రాఫిట్ అంటే అలా ఓ 3 కోట్లు మొత్తం 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇస్మార్ట్ శంకర్, రెడ్ హిట్ తర్వాత రాం తన రెమ్యునరేషన్ పెంచాడు. మొన్నటివరకు 10 కోట్లౌ అటు ఇటుగా ఉండే రామ్ ఇప్పుడు సినిమాకు 15 కోట్లు తక్కువ తీసుకోవట్లేదని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని చూస్తున్న లింగుసామికి రామ్ ఛాన్స్ ఇచ్చాడు.
ఈ సినిమా కథ విన్న వెంటనే రామ్ ఓకే చెప్పాడట. పవర్ ఫుల్ స్టోరీతో వస్తున్న రామ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడని అంటున్నారు. సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా స్పెషల్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో రామ్ ఎనర్జీ అదిరిపోతుందని అంటున్నారు. మరి లింగుసామి, రామ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. రామ్ ఈ సినిమా కోసం స్పెషల్ వర్క్ అవుట్స్ చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: