తాప్సీ నటనకు షాక్ అయిన సహ నటుడు... కామెంట్స్ వైరల్ ?

VAMSI
తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను, ఆ తర్వాత బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడ ఫుల్ గా బిజీ అయిపొయిన విషయం తెలిసిందే. యేడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. హిందీలో వరుస చిత్రాలు చేస్తూ వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను తన వైపు ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఈమె సీనియారిటీపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి మరి బోల్డ్ గా నటించి అబ్బాయిలకే చమటలు పట్టిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విక్రాంత్ మాస్సే - హర్షవర్ధన్ రాణే తాప్సీ  నటించిన హసీనా దిల్ రుబా చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే - హర్షవర్ధన్ రాణే తాప్సీతో  రొమాంటిక్ సీన్ లో నటించడానికి తెగ భయపడ్డాడని, ఆమె మరీ అంత ఫ్రీగా ఉండడంతో కాస్త తడబడ్డాడని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


సాధారణంగా రొమాంటిక్ టచ్ ఎక్కువ ఉండే సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అమ్మాయిలు కాస్త ఇబ్బంది పడతారు, కాస్త బెరుకుతనం కనబరుస్తారు. కానీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ మాత్రం ఈ చిత్రం లో రొమాంటిక్ సీన్లలో చాలా ఫ్రీగా కంఫర్టబుల్ గా నటిచారంటూ ఆమె నటన గురించి కామెంట్ లు వినపడుతున్నాయి. ఇదే విషయాన్ని సహనటి విక్రాంత్ ని అడుగగా ఆయన ఏమన్నారంటే, తాప్సీ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అందరితో చలాకీగా  మాట్లాడుతుంది. కనీసం ఐదు నిమిషాలు కూడా మౌనంగా ఉండలేదు, గడగడ మాట్లాడుతూ సరదాగా ఉంటుంది. తాప్సీతో సన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి భయపడ్డారు అన్న విషయంలో నిజం లేదు.


ఇదో  అవాస్తవ ప్రచారం. మొదట తాప్సీ సన్నిహిత సన్నివేశాలు చేసే సమయంలో చాలా అసౌకర్యంగా ఉందని, షాట్  సరిగ్గా రాకపోవటం చాలా రీటేక్ లు జరుగుతున్నందున దర్శకుడు జోక్యం చేసుకున్న తర్వాతే సన్నివేశాలు అనుకున్న  విధంగా వచ్చాయని  ఆయన అన్నారు. ఇది కేవలం నటన మాత్రమే అన్న విషయాన్ని ఈయన గుర్తు చేశారు.
ప్రస్తుతం  హసీన్ దిల్ రుబా చిత్రం నెట్ ప్లిక్స్ లో ప్రసారం అవుతోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తాప్సీ, విక్రాంత్ తో కలసి కాస్త బోల్డ్ గా నటించింది దాంతో  పలు కథనాలలో తీవ్ర చర్చ మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: