గ్యాంగ్ లీడర్ గా మెగాస్టార్.. ?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి అనగానే మనకు గుర్తుకు వచ్చేది మాస్ సినిమాలు. చిరంజీవి అన్ని రకాల జోనర్ సినిమాలలో కనిపించినప్పటికీ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడిని మాస్ లుక్ లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. మరీ ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి లుక్ అండ్ మేనరిజంకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. సినిమాలో మెగాస్టార్ చెయ్యి చూసావా ఎంత రఫ్ గా రఫ్ ఆడించేస్తాను అంటూ చెప్పే డైలాగులు ఆయ‌న క్యారెక్టర్ ఫ్యాన్స్ కు తెగ న‌చ్చేసింది. దాంతో మెగాస్టార్ ను అలాంటి సినిమాల్లోనే చూడాల‌ని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం ఎక్కువ‌గా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపించారు. రీ ఎంట్రీ త‌ర‌వాత కూడా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు. 


అయితే రీ ఎంట్రీకి ముందు మెగాస్టార్ అందరివాడు సినిమా లో మాస్ హీరోగా కనిపించినా ఈ సినిమా అభిమానులను మాత్రం అంతగా సంతృప్తి పరచలేదు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం మ‌ళ్లీ సినిమాల్లోకి రావ‌డం జ‌రిగింది. దాంతో రీఎంట్రీ త‌ర‌వాత అయినా త‌మ కోరిక నెర‌వేరుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. అయితే త్వ‌ర‌లోనే మెగాస్టార్ అభిమానుల కోరిక నెర‌వేర‌బోతున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ యంగ్ డైరెక్ట‌ర్ బాబితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాతో బాబి ఫ్యాన్స్ కోరిక తీరుస్తార‌ట‌.


బాబి మెగాస్టార్ తో గ్యాంగ్ లీడ‌ర్ లాంటి సినిమాను తెర‌కెక్కిచ‌బోతున్నారట‌. మొదటగా బాబి చెప్పిన కథకు చిరంజీవి పెద్దగా సంతృప్తి చెందక పోవడంతో బాబి క‌థ‌పై మ‌రికొన్ని రోజులు పనిచేసి అందులో మార్పులు చేర్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే  కాకుండా క‌థ‌లో మాస్ ఎలివెంట్స్ కూడా ఎక్కువే ఉన్న‌ట్టు టాక్. అంతే కాకుండా బాబి చెప్పిన క‌థ‌కు మెగాస్టార్ కూడా ఫిదా అయ్యార‌ట‌. దాంతో ఈ సినిమా గ్యాంగ్ లీడ‌ర్ సినిమా లాంటి మాస్ మసాలా సినిమా అని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక బాబి అయినా ఈ సినిమాతో చిరు అభిమానుల కోరిక నెర‌వేరుస్తారా లేదా అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: