సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కేసు ?
ఈ మేరకు వారిపై చండీగఢ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. జులై 13 లోపు ఈ కేసుకు సంబంధించి తగిన క్లారిటీ ఇవ్వాలని సమన్లు జారి చేశారు. అయితే ఆ ఫిర్యాదులో ఏముంది అంటే, అరుణ అనే వ్యాపారి 3 కోట్ల రూపాయల పెట్టుబడితో బీయింగ్ హ్యూమన్ షోరూంను ప్రారంభించారని, ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ తనని బిగ్ బాస్ సెట్లోకి పిలిపించుకుని మరీ అభినందనలు తెలిపి షోరూమ్ ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చారని, కానీ రాలేదని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ సంస్థ నుండి రావాల్సిన దుస్తులు కూడా ఇప్పటి వరకు రాలేదని, దీని గురించి ఎటువంటి సమాచారం అందించలేదని పేర్కొన్నారు.
తీరా వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే అందుబాటులో లేరని ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ కూడా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. వీరిని నమ్మి మూడు కోట్ల రూపాయలు నష్టపోయాను అంటూ వాపోయారు. ఎలాగైనా న్యాయం చేయండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అరుణ్ గుప్త. అయితే ఇప్పుడు ఇందుకు సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో.. ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇలా ఏదో ఒక కారణంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ వార్తల్లో నిలుస్తున్నారు.