బన్నీని ఫాలో అవుతున్న విజయ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తను నటించే ప్రతి సినిమాలో కూడా ఒక సరికొత్త లుక్ ను ప్రేక్షకులకు చూపించి, అందర్నీ అబ్బుర పరుస్తూ ఉంటారు. ఇక ఇదే దారిలో విజయ్ దేవరకొండ నడుస్తున్నారు అంటూ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా కామెంట్ చేస్తూ సంబర పడిపోతున్నారు. అయితే ఆ విషయం ఏమిటనేది.. ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ సినిమా. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆ పాత్ర కోసమే తన జుట్టును ఎక్కువగా పెంచుకోవడంతో పాటు పిలక కట్టుకొని కనిపించి, అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేశాడు. ఇక ఇదే లుక్ లోనే విజయ్ దేవరకొండ కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక విజయ్ దేవరకొండ విమానాశ్రయంలో పిలక కట్టుకొని మీడియా కంట పడ్డాడు. విజయ్ దేవరకొండ ఒక సినిమా కోసం జుట్టు ఎక్కువగా పెంచుకున్నాడు.ఇక తన హెయిర్ స్టైల్ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందిగా ఉందని, పిలక కట్టుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
విజయ్ దేవరకొండ ఇప్పటికే లైగర్ సినిమాలో, అనన్య పాండే తో రొమాన్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ పూరి కాంబినేషన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంలో కరణ్ జోహార్ హీరోగా ,ఛార్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగానే ముంబై చేరుకోవడం గమనార్హం. అంతే కాదు పూరి జగన్నాథ్ అలాగే ఛార్మి లు కూడా ముంబైలో అడుగు పెట్టబోతున్నారు.
ఇక మరో రెండు, మూడు రోజుల్లో లైగర్ సినిమాకు సంబంధించిన రెస్యూమ్ షూట్ మొదలు కాబోతోంది. విజయ్ దేవర కొండ హెయిర్ స్టైల్ ను చూసి ఆయన అభిమానులు సంబరపడిపోయారు. అంతేకాదు అల్లు అర్జున్ అభిమానులు కూడా తెగ సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా స్టార్ హీరోల స్టైలిష్ లుక్కే వేరబ్బా ..! అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.