బండ్ల గణేష్ కూతురు కోరిన కోర్కెలు విని షాక్ లో పవన్ అభిమానులు !
పవన్ కళ్యాణ్ కు ఉన్న భక్తులలో బండ్ల గణేష్ స్థానం చాల ప్రత్యేకమైంది. కేవలం పవన్ కు మాత్రమే కాదు టోటల్ మెగా ఫ్యామిలీకే అతడు వీరాభిమాని. గత కొంత కాలంగా ఈ బ్లాక్ బష్టర్ నిర్మాత పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని చాల గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు.
వాస్తవానికి పవన్ అనేక సినిమాలు చేస్తున్నప్పటికీ ఎందుకనో బండ్ల గణేష్ రాయబారాలకు పవర్ స్టార్ పూర్తిగా స్పందించడం లేదు అన్న గుసగుసలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ సంచలన నిర్మాత తన ప్రయత్నాలు కొనసాగిస్తూ అనేక దర్శకులతో కొన్ని కథలు పవన్ కు చెప్పించి మరో ‘గబ్బర్ సింగ్’ స్థాయిలో హిట్ కొట్టాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పుడు ఈప్రయత్నాలకు బండ్ల గణేష్ కూతురు కూడ రంగంలోకి దిగడం పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ కుటుంబ సభ్యుల గురించి చాలమందికి తెలియదు. ఈమధ్య అతడి కూతురు జనని ని ఒక టివి ఛానల్ కు తీసుకువచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. బండ్ల గణేష్ అతడి కుమార్తె పాల్గొన్న టీవీ కార్యక్రమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఒక ప్రముఖ ఛానల్ కోసం ఓంకార్ నిర్వహిస్తున్న ఒక షోకు బండ్ల గణేష్ అతడి కూతురుతో కలిసి వచ్చాడు. తన కూతురును బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆమెకు 18 ఏళ్లు అని ఇప్పటివరకు తనను ఆమె రెండే రెండు సార్లు తన కోర్కెల్ని చెప్పిందని చెప్పాడు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ తో మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు తీస్తావ్. అదేవిధంగా ఓంకార్ అన్నయ్య షోకు నన్ను ఎప్పుడు తీసుకువెళతావు అన్న కోరికలు కోరిన విషయాన్ని బయటపెట్టాడు. ఓంకార్ షో కోరికను తాను తీర్చగలిగానని అయితే పవన్ కళ్యాణ్ తో మూవీ కోరిక తీరాలి అంటే తనకు పవర్ స్టార్ సహాయం అవసరం అంటూ బుల్లి తెర ద్వారా తన దేవుడు పవన్ కు అభ్యర్ధన చేసాడు..